ఓ ప్రేమకథ : భాగం 4 - అమ్మ ప్రేమ


పల్లవి ప్రతిరోజూ అర్జున్‌ని కలిసేందుకు, అతను ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లేది. పల్లవికి తెలియకుండానే అర్జున్‌పై ఫీలింగ్స్ పెరుగుతాయి.

ఒక రోజు పల్లవి, శ్వేత వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏ వస్తువుని చూసినా అర్జున్ గురించే మాట్లాడడం మొదలుపెడుతుంది. ఇది గమనించిన శ్వేతకు కొంచెం అనుమానం వస్తుంది. వెంటనే అడుగుతుంది "ఏం పల్లవి, అర్జున్ నీ మార్చమంటే... నువ్వే మారిపోయినట్టున్నావేంటి?" 

దీనికి పల్లవి, "అలా ఏం కాదు…" అని చెప్పినా, లోపల మాత్రం ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆమెకు నిజంగా అర్జున్‌ని ప్రేమిస్తున్నానని అర్థమవుతుంది.

ఆ రోజు నుంచి పల్లవి అర్జున్‌ను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది.

ఒక రోజు పల్లవి, అర్జున్ ఇద్దరూ బయటకు వెళ్తారు. అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతోంది. పల్లవి, “వెళ్దాం… వెళ్దాం” అంటూ అర్జున్‌ను విసిగిస్తుంటే, చివరికి అర్జున్ ఒప్పుకుంటాడు.

అదే జాతర లో ఆ ఏరియా ఎమ్మెల్యే కొడుకు ఉంటాడు. పల్లవిని చూస్తూ తప్పుడు మాటలు మాట్లాడి, ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కోపంతో పల్లవి వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది.

అర్జున్ వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే, ఆ గ్యాంగ్‌లో ఒకడు కత్తి పట్టుకుని నేరుగా పల్లవి వైపు దూసుకొస్తాడు. ఆ క్షణంలో అర్జున్ తన చేతితో కత్తిని పట్టుకుని ఆపేస్తాడు. ఆ సమయంలో అతని చేతికి గాయం అవుతుంది. అయినా ఆ గాయాన్ని పట్టించుకోకుండా, అర్జున్ వాళ్లందరినీ కొట్టి తరిమేస్తాడు.

తర్వాత అర్జున్, పల్లవి దగ్గరకు వస్తుండగా, అతని చేతి నుంచి రక్తం కారడం చూసిన పల్లవి వెంటనే తన స్కార్ఫ్‌ని అర్జున్ చేతికి కడుతుంది. అర్జున్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది.

అర్జున్ ఇంకా పల్లవి ఇంటికి చేరుకున్నాక, "పల్లవి, నువ్వు వెళ్ళిపో… నేను చూసుకుంటాను" అని అంటాడు అర్జున్.

కానీ పల్లవి అతని మాట పట్టించుకోకుండా, "నువ్వు చేసింది చాలుగానీ, ఇప్పుడు కాస్త నోరుమూసుకుని ఉండు. నీకు తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను. నీకు ఏమైనా సమస్యా? నీకు ఏం ఇబ్బంది ఉన్నా నాకు పర్వాలేదు…" అని అంటుంది.

కాసేపటికి, పల్లవి అర్జున్ కోసం భోజనం చేసి తీసుకొచ్చి, తన చేతులతోనే తినిపిస్తుంది.

ఇది అంత చూస్తున అర్జున్‌కి తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు మెదులుతాయి — ముఖ్యంగా తన అమ్మ గుర్తుకొస్తుంది.

అర్జున్ పల్లవితో, "నేను ఎవరికీ చెప్పని విషయం ఒక్కటి నీకు చెబుతున్నా… నేను కిషోర్‌కి ఎందుకు అంతగా దగ్గర అయ్యానో తెలుసా? అతను చేసే పనులు… మా అమ్మను గుర్తు చేసేవి…" అని చెబుతాడు.

పల్లవి, చిన్న చిరునవ్వుతో, "అవి మాకు కూడా చెప్పొచ్చు కదా…" అని అంటుంది.

అర్జున్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కొంత సేపటి తర్వాత లోతుగా శ్వాస తీసుకొని మొదలుపెట్టాడు - " నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ దూరమైపోయింది". మా నాన్నగారు నా కోసం అని ఇంకో పెళ్లి చేసుకున్నారు. కానీ మా పిన్ని నన్ను అసలు పట్టించుకునేది కాదు. నాకు ఒక తమ్ముడు పుట్టాడు; మా పిన్ని తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునేది… కానీ నన్ను మాత్రం పట్టించుకునేది కాదు. 

అమ్మ నా పైన చూపించే ప్రేమ మళ్లీ నాకు దొరకదనుకున్నా, కిషోర్ మా గ్యాంగ్‌లో కలిసే వరకు... కిషోర్ వచ్చిన తరువాత అతను చేసే పనులు, అతను మాట్లాడే మాటలు… ముఖ్యంగా అతను నా మీద చూపించే ఆ ప్రేమ మా అమ్మని నాకు గుర్తుచేసేవి. 

ఒక రోజు పరీక్షలో మాకు తక్కువ మార్కులు వచ్చాయని మా మాస్టర్ గారు నన్ను, చంటి, చైతన్యను కొట్టారు. ఆ నొప్పికి నేను ఆ రోజు మధ్యాహ్నం ఏం తినలేదు. అప్పుడు కిషోర్ నా దగ్గరకు వచ్చి నా కళ్లను తుడిచాడు. 

"అర్జున్, నొప్పిగా ఉందా? ఏం కాదు రా… మాస్టర్ గారు మార్కులు తక్కువ వచ్చాయి అని కొట్టారు. తరువాతి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్లకు నువ్వు ఎంత కష్టపడతావో తెలుస్తుంది. లేచి తిను…" అని ధైర్యం చెప్పి, నాకు తినిపించాడు.

ఆ సమయంలో నాకు గుర్తొచ్చింది — మా నాన్నగారు మార్కులు తక్కువ వచ్చాయని నన్ను కొట్టినపుడు, ఎలా అయితే అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని, ప్రేమగా హత్తుకుని, తన చేతులతో తినిపించేదో… అచ్చం అలానే అనిపించింది.

ఆ క్షణం లో కిషోర్ చూపించే ప్రేమ అచ్చం మా అమ్మ చూపించే ప్రేమలాగా అనిపించింది. అప్పుడు మా అమ్మ ప్రేమ కిషోర్ రూపంలో నాకు దొరికిందని అనుకున్నా… కానీ చివరికి కిషోర్ కూడా మా అమ్మలాగే నన్ను వదిలి వెళ్ళిపోయాడు."

ఇది అంత విన్న పల్లవి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తన మనసులో – “అప్పుడెప్పుడో ఎవరో చూపించిన కేరింగ్ గుర్తొచ్చింది… కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న కేరింగ్ మాత్రం హీరో గారికి కనిపించడం లేదు…” అని ప్రేమగా అర్జున్‌ని తిట్టుకుంటుంది.

కొద్దిసేపటి తరువాత ఇద్దరూ పడుకుంటారు. అర్జున్, పల్లవిని చూస్తూ – “ఏంటి ఈ పిల్ల నన్ను నిజంగానే ప్రేమిస్తుందా? అసలు ఈ పనులు చేయాల్సిన అవసరం ఈ అమ్మాయికి లేదు కదా…” అని ఆలోచిస్తూ కళ్లను మూసుకుంటాడు.

కొన్ని రోజులకి అర్జున్‌కి తగిలిన గాయం తగ్గిపోతుంది. పల్లవి వెళ్ళిపోతూ అర్జున్‌తో – “అర్జున్, ఎవరో అమ్మాయి ఎప్పుడో నీ స్నేహితుడిని మోసం చేసింది కాబట్టి, అందరూ అమ్మాయిలు అలానే ఉంటారు అనుకోవడం సరైంది కాదు. ఇప్పటికైనా చైతన్యతో మాట్లాడు…” అని అంటుంది.

అసలు అర్జున్ చైతన్యతో మాట్లాడాడా? పల్లవికి నిజంగా ఏం జరిగింది? చివరికి అర్జున్‌కి పల్లవి చనిపోయిందని తెలిసిందా?

ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చివరి భాగంలో తెలుస్తుంది. October 2న కలుద్దాం.

చదివినందుకు ధన్యవాదాలు.

                               

Written by

బాలాజీ     




Comments

Popular posts from this blog

ఓ ప్రేమ కథ - భాగం 1: ఆరంభం – ఒక చిన్న తప్పు, ఒక నిజమైన అనుభూతి

ఓ ప్రేమకథ – భాగం 2 : ఒక మోసం – ఐదుగురి జీవితాలని మార్చేసిన నిర్ణయం

ఓ ప్రేమకథ : భాగం 3 – ఒక చిన్న ప్రయత్నం ఎక్కడికి దారి తీస్తుందో