ఓ ప్రేమకథ : భాగం 3 – ఒక చిన్న ప్రయత్నం ఎక్కడికి దారి తీస్తుందో

అర్జున్ ఇంకా అతని ఫ్రెండ్స్ అదే మాటపై నిలబడి ఉంటారు. అందరూ తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు; కానీ చైతన్య మాత్రం మిత్రులతో చేసిన ఒప్పందాన్ని మర్చిపోయి శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా అతను జాగ్రత్త పడతాడు. కానీ ఒక రోజు చైతన్య శ్వేతతో మాట్లాడుతుండగా, అర్జున్‌కి కంటపడతాడు. అప్పటి నుంచి అర్జున్ మరియు అతని గ్యాంగ్ చైతన్యతో మాట్లాడటం మానేస్తారు.

ఒక రోజు చైతన్య శ్వేత కోసం వాళ్ల కాలేజ్ ముందు ఎదురు చూస్తుంటాడు. అదే టైంలో అర్జున్ పక్కన ఉన్న మెకానిక్ షాప్‌కి వస్తాడు. చైతన్య, అర్జున్‌తో మాట్లాడుదాం అని అతని దగ్గరకి వెళ్తుండగా, శ్వేత మరియు ఆమె ఫ్రెండ్ పల్లవి అక్కడికి వస్తారు. కొద్ది సేపటి తరువాత అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, చైతన్య అర్జున్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, కానీ అర్జున్ మాత్రం ఏం పట్టించుకోడు. ఇది అంతా చూస్తున్న పల్లవి అర్జున్‌ని తిట్టడం మొదలుపెడుతుంది; చైతన్య మాత్రం "అతడు నా ఫ్రెండ్" అని చెప్పి పల్లవి నోరు మూయిస్తాడు.

ఇంకో రోజు చైతన్య, శ్వేత, పల్లవి షాపింగ్‌కి వెళ్తారు. అర్జున్, చంటి కూడా అక్కడికి వస్తారు. ఈసారి కూడా అర్జున్, చైతన్య ఎదురుపడతారు; కానీ చైతన్య ఎంత ప్రయత్నించినా, అర్జున్ మాత్రం పట్టించుకోడు.

ఇది చూసి పల్లవికి ఈసారి మాత్రం చాలా కోపం వస్తుంది. "అతను ఎవరు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది?" అని అడుగుతుంది. అప్పుడు శ్వేత "అతను చైతన్య ఫ్రెండ్ అర్జున్. చైతన్య ఒక ప్రామిస్ బ్రేక్ చేశాడని, అప్పటి నుంచి అర్జున్ మాట్లాడడం మానేశాడు." అని చెబుతుంది.

"ప్రామిస్ ఆ!? ఏం ప్రామిస్ అది?" అని చైతన్యని ప్రశ్నిస్తుంది పల్లవి. చైతన్య జరిగిన విషయం అంతా చెబుతాడు. మొత్తం విన్న తరువాత పల్లవి ఇలా అంటుంది: "అది అంత జరిగిపోయి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇలానే ఉంటే ఎలా? కొంచెం అయినా మారాలి కదా!". "అవును, కానీ అందులో వాడి తప్పు ఏం లేదు. ఆ సంఘటన వాడిని అలా మార్చేసింది" అని అంటాడు చైతన్య.

అప్పుడు శ్వేత "పల్లవి, నువ్వు సైకాలజీ స్టూడెంట్ కదా. తనని మార్చడానికి ఏమైనా చేయగలవా?" అని అడుగుతుంది.

పల్లవి ఏదో ఆలోచిస్తూ, తల ఊపుతూ: "హా సరే, చూద్దాం" అని అంటుంది.

మరుసటి రోజు చైతన్య, పల్లవి ఇద్దరూ కలిసి చంటి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చైతన్య చంటి తో "ఈమె శ్వేత ఫ్రెండ్ పల్లవి. అర్జున్‌ని లవ్ చేస్తున్నానంటూ నా తల తినేస్తుంది. ఒక్కసారి అర్జున్‌తో మాట్లాడాలని అడుగుతోంది" అని చెబుతాడు.

ఇది విన్న చంటి, పల్లవి వైపు చూసి నవ్వుతూ, "ఏంటి! అర్జున్‌ని లవ్ చేస్తున్నావా!! నీకు అసలు అర్జున్ గురించి ఏమి తెలుసు అని లవ్ చేస్తున్నావ్ అని అంటున్నావు?" అని అడుగుతాడు.

పల్లవి చంటి తో "నాకు అన్నీ తెలుసు. చైతన్య జరిగింది అంత నాకు చెప్పాడు. అర్జున్ చేసిన ప్రామిస్ కూడా చెప్పాడు" అని అంటుంది.

"సరే, నేను ఏమి చేయాలో చెప్పండి" అని అంటాడు చంటి.

అప్పుడు పల్లవి: "నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్లి, రే అర్జున్, చైతన్య ఫ్రెండ్ పల్లవి అంత, నిన్ను లవ్ చేస్తుంది అంత. నీతో మాట్లాడాలని చైతన్య తో పాటు వచ్చి అడిగింది. నేను సరే అన్నాను, కానీ బెట్ వేసాను—అర్జున్ ఎప్పటికీ నీ లవ్ అంగీకరించడు అని” అని చెప్పు అని చెబుతుంది.

చంటి కూడా అచ్చం పల్లవి చెప్పినట్టే అర్జున్ దగ్గరికి వెళ్లి చెబుతాడు.

ఇది విన్న అర్జున్, చంటి మీద కోపంతో తిట్టేస్తాడు. కానీ చంటి ఎలాగోలా మాటలు తిప్పుతూ, చివరికి అర్జున్‌ని ఒప్పిస్తాడు.

మరుసటి రోజు అర్జున్ కాఫీ షాప్‌కి వెళ్తాడు. పల్లవి కూడా అదే కాఫీ షాప్‌కి వచ్చి, అర్జున్ కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చుంటుంది. వెయిటర్ వచ్చి అర్జున్ నీ ఆర్డర్ అడగగా, అతను ఆర్డర్ ఇస్తాడు. పల్లవి కూడా "అదే నాకు కూడా" అంటుంది. అర్జున్, "సిటీకి కొత్తగా వచ్చిందనుకుంటా" అని అనుకోని వదిలేస్తాడు.

కాసేపు తరువాత పల్లవి, "మీ చుట్టూ రెండు వారాల నుంచి తిరుగుతున్నాను, మీరు అంటే నాకు ఇష్టం" అని అంటుంది. మొదట అర్జున్ పట్టించుకోడు. కానీ పల్లవి పదే పదే అదే మాటలు చెబుతుంటే, అర్జున్‌కి కోపం వచ్చి ఆమెను కొట్టబోతాడు. అప్పుడు పల్లవి ఫ్రెండ్ అకస్మాత్తుగా అక్కడికి వచ్చి, "ఇది సినిమా ఆడిషన్ కోసం మాత్రమే" అని చెబుతుంది. ఏం చేయలేని స్థితిలో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తరువాత రోజు చంటి, అర్జున్ ఇద్దరూ పల్లవి నీ కలవడానికి అని నిన్న వెళ్లిన కాఫీ షాప్‌కే వెళ్తారు. పల్లవి కూడా వాళ్ల కోసం అక్కడికి వస్తుంది. పల్లవిని చూసిన అర్జున్, “ఈ రోజు ఎవరినీ ప్రాంక్ చేయడానికి వచ్చిందో అనుకోని, ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి రా ఆమె కోసం?” అని చంటిని అడుగుతాడు.

పల్లవి వచ్చి అదే టేబుల్‌లో కూర్చుంటుంది. అర్జున్ కోపంగా, “నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? మేము వేరే వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళిపో ఇక్కడనుంచి,” అని అంటాడు.

అప్పుడు చంటి, “రేయ్! మనం ఆమె కోసం ఏ వెయిట్ చేస్తున్నాం. అయినా నీకు తను ఎలా తెలుసు రా?” అని అడుగుతాడు. అర్జున్, “అది పెద్ద కథ రా… తరువాత చెబుతా,” అని అంటాడు.

తర్వాత అర్జున్ పల్లవితో, “నువ్వు నా ఫోటో చూడలేదా? లేక కావాలనే చేశావా?” అని అడుగుతాడు. పల్లవి చిన్నగా చిరునవ్వు ఇచ్చి ఏం మాట్లాడదు. అర్జున్ కోపంగా, “సరే, చెప్పు… నా గురించి నీకు ఏం తెలుసు అని నన్ను లవ్ చేస్తున్నావ్?” అని ప్రశ్నిస్తాడు.

దానికి పల్లవి, “నేను మీ ఫ్రెండ్ చైతన్య లవర్‌కి ఫ్రెండ్‌ని. నాకు చైతన్య అంతా చెప్పాడు,” అంటూ జరిగినదంతా చెబుతుంది. అర్జున్, “సరే, చూద్దాం… నువ్వు నన్ను ఎలా మారుస్తావో,” అని అంటాడు.

చదివినందుకు ధన్యవాదాలు.
      తర్వాతి భాగంతో వచ్చే వారం కలుద్దాం!"🙏☺️

 

 Written by

బాలాజీ   

Comments

Popular posts from this blog

ఓ ప్రేమ కథ - భాగం 1: ఆరంభం – ఒక చిన్న తప్పు, ఒక నిజమైన అనుభూతి

ఓ ప్రేమకథ – భాగం 2 : ఒక మోసం – ఐదుగురి జీవితాలని మార్చేసిన నిర్ణయం