ఓ ప్రేమకథ – భాగం 2 : ఒక మోసం – ఐదుగురి జీవితాలని మార్చేసిన నిర్ణయం
అప్పటి నుంచీ కిషోర్, అర్జున్, కృష్ణ, చైతన్య, చంటి — ఐదుగురూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ ఫ్రెండ్షిప్‌లో, కొన్ని రోజులు గడిచేసరికి అందరికన్నా కిషోర్ కి అర్జున్ ఎంతో దగ్గరైపోతాడు. అర్జున్‌కి కిషోర్ ప్రవర్తన నచ్చుతుంది; కిషోర్‌ని ఒక మంచి ఫ్రెండ్ లా భావించటం మొదలుపెడతాడు. కిషోర్ కి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే, ముందు అడుగు వేసేది అర్జునే.
అలా
సాగుతూ వాళ్లు 10వ తరగతికి వస్తారు. కిషోర్ - బాగా చదువుకునే విద్యార్థి. టీచర్లకి ఇష్టం. అర్జున్ గ్యాంగ్ - స్కూల్లోనే ఎక్కువ గోల చేసే స్టూడెంట్స్, టీచర్స్ కి అసలు నచ్చేవారు కాదు. టీచర్స్ అందరూ కిషోర్‌ని వేరుగా పిలిచి అడుగుతారు —
"నువ్వు
బాగా చదువుతున్నవాడివి, ఎందుకు వాళ్లతో తిరుగుతున్నావు? ఆ ఫ్రెండ్‌షిప్ కట్ చెయ్యి."
అదే
స్కూల్‌లో వైష్ణవి అనే అమ్మాయి కొత్తగా జాయిన్ అవుతుంది. ఆమెను చూసిన తొలి క్షణం నుంచే కిషోర్‌కి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. వైష్ణవి ఆలస్యంగా జాయిన్ అవ్వడంతో, టీచర్లు ఆమెను కిషోర్ దగ్గర సహాయం తీసుకోమని చెప్తారు. ఆ విధంగా వాళ్లిద్దరి మధ్య మొదలైన పరిచయం, క్రమంగా స్నేహంగా మారుతుంది. కిషోర్ అప్పటి నుంచి ఎక్కువ సమయం వైష్ణవితో గడుపుతాడు. ఒకరోజు, అర్జున్ ఇంకా కిషోర్ ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు కిషోర్ అర్జున్‌ను చూస్తూ —"రే అర్జున్, నీకు ఒక విషయం చెప్పాలి. మన క్లాస్‌లో వైష్ణవి ఉంది కదా... నేను ఆమెను ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది రా." ఇది విన్న అర్జున్ —
"ఏమో
రా... నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు" అని అంటాడు.
ఒక్కరోజు కిషోర్ వైష్ణవికి ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవీ కూడా ఒప్పుకుంటుంది. ఇంతలో 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. మంచి మార్కులు రావాలని అర్జున్ వాళ్లు గట్టిగా కృషి చేస్తారు. కిషోర్ కూడా బాగా చదువుతాడు. అందరూ పరీక్షలు బాగా రాస్తారు.
పరీక్షల
చివరి రోజు —
అదే రోజు వైష్ణవీ పుట్టినరోజు. కిషోర్ పరీక్షను త్వరగా ముగించి, వైష్ణవి పరీక్ష కేంద్రానికి వెళ్తాడు. అక్కడికి చేరుకునేసరికి పరీక్ష పూర్తయి అందరూ బయటికి వస్తున్నారు. కిషోర్, వైష్ణవిని చూస్తాడు. ఆమెను పిలవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె ఎవరో బండిపై ఎక్కి వెళ్లిపోతుంది.
కిషోర్
ఆ బండి వెనక వెంటనే వెళ్తాడు. వారు ఒక పార్క్ లోకి వెళ్తారు. కిషోర్ తీవ్ర గందరగోళంతో లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక అబ్బాయి, వైష్ణవికి ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవీ కూడా నవ్వుతూ ఒప్పుకుంటుంది.
ఇది
అంతా చూసిన కిషోర్‌కి ఏం అర్థం కావడం లేదు. తను తీసుకువచ్చిన గిఫ్ట్‌ని అక్కడే పడేసి, మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నేరుగా ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ నాన్నగారు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి మాట్లాడుతూ ఇలా అంటారు— "మా అబ్బాయికి తప్పకుండా మంచి మార్కులు వస్తాయ్, మంచి కాలేజీలో చేర్పిస్తాను."
ఆ
మాటలు విన్న కిషోర్ - " వాళ్ళ నాన్నని మోసం చేస్తున్నానేమో" అన్న భావనతో తల వంచి, మౌనంగా తన గదిలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఏడుస్తాడు.
కాసేపటి
తరువాత కిషోర్, అర్జున్ వాళ్లని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి వెళ్లగానే ఇలా అంటాడు —
"ఈరోజు
మా ఇంటి డాబా పైన అందరం కలసి పాడుకుందాం రా, చాలా రోజులు అయ్యింది కదా." అందరూ వస్తారు. అందరూ కలిసి తింటారు, తిన్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు.
ఆ
టైమ్‌లో కిషోర్, అర్జున్ చెయ్యి పట్టుకుని ఒకసారిగా —"నన్ను క్షమించురా" అని అంటాడు. అర్జున్ షాక్ అయ్యి అడుగుతాడు —
"ఏం
అంటున్నావురా? నువ్వు బాగానే ఉన్నావు కదా!". కిషోర్ తల ఊపుతూ —
"ఏం
లేదు రా, ఏమీలేదు" అంటాడు, ఆ టాపిక్ అక్కడితో ముగిస్తుంది.
తర్వాత
అందరూ నిద్రపోతారు. మధ్యలో అర్జున్ కి మెలుకువ వచ్చి లేచి బయటికొస్తాడు. ఆ టైమ్‌లో కిషోర్ ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. అర్జున్ అడుగుతాడు —
"ఏంటి
రా, ఇంకా నిద్రపోలేదా? ఏం రాస్తున్నావు?" కిషోర్ మళ్ళీ —
"ఏం
లేదు రా... పడుకుందాం" అని అర్జున్ నీ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ అర్జున్ "ఏం అయింది రా? ఏమైనా సమస్య ఉందా?" అని అడుగుతాడు. కిషోర్ మళ్ళీ " ఏం లేదు రా ఏం లేదు " అని నవ్వుతూ పడుకోవడానికి వెళ్తారు.
అలా
ఇద్దరూ మళ్లీ పడుకుంటారు. మళ్ళీ కొంచం సేపటి తర్వాత కిషోర్ నిద్రపోతున్న అర్జున్ ని చూసి నిశ్శబ్దంగా —"నన్ను క్షమించురా" అని అంటాడు.
వాళ్లు
అంతా కాసేపటికి పడుకుంటారు.
తెల్లవారు జామున కృష్ణ తొందరగా లేస్తాడు, సూర్యోదయం చూద్దాం అని.కృష్ణ బయటకు వచ్చేసరికి, కిషోర్ డాబా అంచున నిలబడి ఉన్నాడు. ఇక మిగిలింది ఒక్క క్షణం. కృష్ణ "ఏం చేస్తున్నావురా!" అని గట్టిగా అరవడానికి ముందే, కిషోర్ కిందకి దూకేసాడు. అది చూసిన కృష్ణ గట్టిగా అరుస్తాడు —
"అర్జున్!!
అర్జున్!! కిషోర్ డాబా పైనుంచి దూకేసాడు!". ఆ అరుపుతో అందరూ లేచి బయటకు పరుగెత్తుతారు. వాళ్లు కిందకి చూసేసరికి కిషోర్ రక్తపు చెరిలో పడివున్నాడు.
అర్జున్
ఒక్కసారిగా కన్నీళ్లతో కిందకు చూస్తుండగానే…తన కాళ్ళ దగ్గర కి ఒక కాగితం కదిలి వస్తుంది. అర్జున్ దాన్ని తీసుకొని చదవడం మొదలుపెడతాడు — "అమ్మా, నాన్నా... నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మోసం చేశాను. మీరు నాపైన పెట్టిన నమ్మకాలు నేను నిలబెట్టుకోలేకపోయాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆమె నన్ను మోసం చేసింది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
అర్జున్!
నువ్వు నా జీవితంలో దొరికిన గొప్ప ఫ్రెండ్ రా. ఇంకో జన్మ ఉంటే నన్ను మళ్లీ నీ ఫ్రెండ్ గా చేర్చుకోరా. క్షమించురా రా."
వాళ్ల అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తుంటారు. అర్జున్ ఆ లెటర్ చదివిన తరువాత, ఏం మాట్లాడకుండా అక్కడే కూర్చొని, కిషోర్ తో తను గడిపిన సమయాన్ని గుర్తుతెచ్చుకుంటాడు. ఇంతలో కిషోర్ నాన్నగారు అర్జున్ దగ్గరకు వచ్చి, ఏడుస్తూ అంటారు—"నాన్నా అర్జున్! వాడికి మనం ఏం చేశామని... మనల్ని ఇలా బాధపెడుతున్నాడు రా!. వాడికి ఏమైనా సమస్య ఉంటే, మనకి చెప్పాలి కదా రా!" అని అర్జున్ నీ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అర్జున్ మౌనంగా, నిన్నటి సంఘటనను గుర్తు చేసుకుంటూ అంటాడు—"నిన్న రాత్రి అడిగాను అంకుల్, ఏమైనా సమస్య ఉందా? ఏదైనా ఉంటే చెప్పు రా అని. కానీ వాడు ఏం చెప్పలేదు!"
తరువాత,
అర్జున్ తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తాడు. కళ్ళలో బాధ, గుండెల్లో ఆవేశం. "రే, కిషోర్ మన మధ్యలో లేడు అనే నిజం నీ ఊహించుకోలేకపోతున్నాం.
ఇకపై మన లైఫ్‌లో ‘అమ్మాయి’ అనే పదమే ఉండకూడదు. మనమంతా ఈ మాట మీద నిలబడదాం!" అంటూ అందరితో మాత తీసుకుంటాడు.


Written by
బాలాజీ
Comments
Post a Comment