ఓ ప్రేమకథ : భాగం 4 - అమ్మ ప్రేమ
పల్లవి ప్రతిరోజూ అర్జున్‌ని కలిసేందుకు, అతను ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లేది. పల్లవికి తెలియకుండానే అర్జున్‌పై ఫీలింగ్స్ పెరుగుతాయి. ఒక రోజు పల్లవి, శ్వేత వాళ్ల ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏ వస్తువుని చూసినా అర్జున్ గురించే మాట్లాడడం మొదలుపెడుతుంది. ఇది గమనించిన శ్వేతకు కొంచెం అనుమానం వస్తుంది. వెంటనే అడుగుతుంది "ఏం పల్లవి, అర్జున్ నీ మార్చమంటే... నువ్వే మారిపోయినట్టున్నావేంటి?" దీనికి పల్లవి, "అలా ఏం కాదు…" అని చెప్పినా, లోపల మాత్రం ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆమెకు నిజంగా అర్జున్‌ని ప్రేమిస్తున్నానని అర్థమవుతుంది. ఆ రోజు నుంచి పల్లవి అర్జున్‌ను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఒక రోజు పల్లవి, అర్జున్ ఇద్దరూ బయటకు వెళ్తారు. అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతోంది. పల్లవి, “వెళ్దాం… వెళ్దాం” అంటూ అర్జున్‌ను విసిగిస్తుంటే, చివరికి అర్జున్ ఒప్పుకుంటాడు. అదే జాతర లో ఆ ఏరియా ఎమ్మెల్యే కొడుకు ఉంటాడు. పల్లవిని చూస్తూ తప్పుడు మాటలు మాట్లాడి, ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కోపంతో పల్లవి వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది. అర్జున్ వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే, ...