ఓ ప్రేమకథ : భాగం 3 – ఒక చిన్న ప్రయత్నం ఎక్కడికి దారి తీస్తుందో
అర్జున్ ఇంకా అతని ఫ్రెండ్స్ అదే మాటపై నిలబడి ఉంటారు. అందరూ తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు; కానీ చైతన్య మాత్రం మిత్రులతో చేసిన ఒప్పందాన్ని మర్చిపోయి శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా అతను జాగ్రత్త పడతాడు. కానీ ఒక రోజు చైతన్య శ్వేతతో మాట్లాడుతుండగా, అర్జున్‌కి కంటపడతాడు. అప్పటి నుంచి అర్జున్ మరియు అతని గ్యాంగ్ చైతన్యతో మాట్లాడటం మానేస్తారు. ఒక రోజు చైతన్య శ్వేత కోసం వాళ్ల కాలేజ్ ముందు ఎదురు చూస్తుంటాడు. అదే టైంలో అర్జున్ పక్కన ఉన్న మెకానిక్ షాప్‌కి వస్తాడు. చైతన్య, అర్జున్‌తో మాట్లాడుదాం అని అతని దగ్గరకి వెళ్తుండగా, శ్వేత మరియు ఆమె ఫ్రెండ్ పల్లవి అక్కడికి వస్తారు. కొద్ది సేపటి తరువాత అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, చైతన్య అర్జున్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, కానీ అర్జున్ మాత్రం ఏం పట్టించుకోడు. ఇది అంతా చూస్తున్న పల్లవి అర్జున్‌ని తిట్టడం మొదలుపెడుతుంది; చైతన్య మాత్రం "అతడు నా ఫ్రెండ్" అని చెప్పి పల్లవి నోరు మూయిస్తాడు. ఇంకో రోజు చైతన్య, శ్వేత, పల్లవి షాపింగ్‌కి వెళ్తారు. అర్జున్, చంటి కూడా అక్కడికి వస్తారు. ఈసారి కూడా అర్జున్, చైతన్య ఎదురుప...