Posts

Showing posts from July, 2025

ఓ ప్రేమ కథ - భాగం 1: ఆరంభం – ఒక చిన్న తప్పు, ఒక నిజమైన అనుభూతి

Image
అర్జున్ , పల్లవి బీచ్‌లో కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు . అదే టైమ్‌లో అర్జున్ ఫ్రెండ్స్ బంటీ , చంటి కూడా అక్కడికి వస్తారు . బంటీ అర్జున్‌ని చూసి షాక్ అయి , చంటి తో ఇలా అంటాడు - " రే చంటి ! అర్జున్ ఏంటి రా , తనలో తాను మాట్లాడుకుంటున్నాడు " ? ఇది విన్న చంటి నవ్వుతూ - " పల్లవితో మాట్లాడుతున్నాడు " అని అంటాడు . " ఏంటి ! పల్లవితో మాట్లాడుతున్నాడా ? పల్లవి చనిపోయింది కదా !" అని అంటాడు బంటీ . అదే టైం కి , ఎవరో అర్జున్‌ని తల మీద కర్రతో కొడతారు . అర్జున్ కింద పడిపోతాడు . అయినా ఆగకుండా కొడుతూనే ఉంటారు . కాసేపటికి అందరూ అక్కడికి వచ్చేసరికి వాళ్లు అక్కడినుంచి వెళ్ళిపోతారు . వాళ్లలో ఒక్కడు మాత్రం వెళ్ళిపోతూ , వెనక్కి వచ్చి అర్జున్ కడుపులో గట్టిగా తన్ని వెళ్ళిపోతాడు . చంటి , బంటీ అర్జున్‌ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు . అడ్మిట్ చేసిన తర్వాత బంటీ , చంటిని ఇలా అడుగుతాడు — " రే చంటి ... పల్లవి చనిపోయి ఒక్క సంవత్సరం అయింది కదా ?"              ...